Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు తహశీల్దార్ కార్యాలయం పుట్టినరోజు వేడుకలకు వేదికగా మారింది. తహశీల్దార్ భగవాన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాన్ని ఫంక్షన్ హాలుగా మార్చారు. తహశీల్దార్ తన పుట్టిన రోజు వేడుకలను కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. కార్యాలయంలో కేకులు కోసి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దేశ నాయకులకు సంబంధించిన వేడుకలు, ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు తప్ప, సిబ్బంది తమ వ్యక్తిగత అవసరాలకు కార్యాలయాలను వినియోగించకూడదనే నిబంధనలున్న అవేమి పట్టించుకోకుండా నిబంధనలు అతిక్రమించి తహశీల్దార్ భగవాన్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలు కార్యాలయంలో నిర్వహించుకోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి తహశీల్దార్ వ్యవహారశైలిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం గమనార్హం. ఈ వివాదాస్పద కార్యక్రమంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.