Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన పోడురైతు పొలికేక రహదారుల దిగ్భందనానికి వస్తున్న గిరిజన పోడు రైతుల పై దుమ్ముగూడెం పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. లకీëనగరం సెంటర్లో భద్రాచలం, చర్ల ప్రదాన రహదారి దిగ్బందనానికి పోడు రైతులు వేలాదిగా తరలి రావాలని అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చిన నేపద్యంలో ఉదయం ఎనిమిది గంటల నుండే దుమ్ముగూడెం పోలీసులు జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్ ఆద్వర్యంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సిబ్బందితో పాటు పోలీసులు దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు నుండి లకీëనగరం స్టేట్ బ్యాంకు వరకు ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. జెండాలు కట్టుకుని వాహనాల మీద వస్తున్న పోడు సాగుదారులను ఆపడంతో పాటు వారిని వీడియోలు సైతం తీశారు. ఒక విదంగా పొలికేకను పోలీసులు అడ్డుకుంటారేమో ననే వాతావరణం నెలకొంది. ఏది ఎమైనప్పటికీ వేలాదిగా తరలి వచ్చిన పోడు రైతుల పొలికేక సడక్ బంద్ విజయవంతం అయిందనే చెప్పవచ్చు.