Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆర్టీసీ పరిరక్షణకు కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయలకులు పిలుపు నిచ్చారు. మంగళవారం కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో అక్టోబర్ 5న ''ఆర్టీసీ పరిరక్షణ-కార్మికుల త్యాగాల దినం'' సందర్భ ంగా ప్రదర్శన నిర్వహించారు. కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదురుగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు జాకబ్, కెఎస్.రావు, జానీమియా, రాములు, ఏవి.రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జి.ఆర్.బాబు, టి.బిక్షపతి, అనిల్, టిఎంయు నాయకులు వేణుగోపాల్, ఇ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : ఆర్టీసీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించినట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి కెవి.రామారావు తెలిపారు. మంగళవారం ఆర్టీసి ప్రాంగణంలో ఆర్టీసి సమ్మె జరిగి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా కార్మికుల త్యాగాల దినంగా జరుపాలని రాష్ట జేఏసి పిలుపునిచ్చింది. అందులో భాగంగా మణుగూరు డిపోలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎస్రాములు, పి.వీలు, టిఎస్ రావు, కెఎస్ నారాయణ, ఎస్కె.రావు, వైఎన్రావు తదితరులు పాల్గొన్నారు.