Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎఫ్ఆర్వో మామిడిశెట్టి మురళి
నవతెలంగాణ-గుండాల
వనాలను పెంచి వన్య ప్రాణులను రక్షించాలని ఎఫ్ఆర్వో మామిడిశెట్టి మురళి అన్నారు. వన్యప్రాణి వారోత్సవా లలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో వనాలను పెంచండి, వన్యప్రాణులను రక్షించండి అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, సీఐ సీహెచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో బాలాజీ, అటవీ శాక సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కిషన్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.