Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర సలహాదారులు కాసాని అయిలయ్య డిమాండ్
అ అదనపు కలెక్టర్కు వినతి పత్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
గొర్రెల యూనిట్ రూ.2లక్షల 25 వేలు ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర సలహాదారులు కాసాని అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. గొర్రెల మేకల పెంపకం దారులకు పెరిగిన ధరలకి అనుగుణంగా ఒక్కొక్క యూనిట్ రూ.2.25 వేలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బచ్చలకూర శ్రీను, సంఘం జిల్లా నాయకులు కొండ బోయిన వెంకటేశ్వర్లు, కృష్ణ, గంగయ్య, శ్రీకాంత్, శంకరయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.