Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
నవతెలంగాణ-తల్లాడ
తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ వాహనాల రాకపోకలతో దుమ్మురేపుతోంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాదచారులు రింగ్ రోడ్డు సెంటర్కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయన ప్రజలు వాపోతున్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న దుకాణదారులు దుమ్ముతో బేజారు అవుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు ఉన్నారో లేరో అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు నెలలుగా పెద్దపెద్ద గోతులతో నానా ఇబ్బందులు పాలైన వాహనచోదకులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో, గ్రామపంచాయతీ వారు గుంతలో కంకర పోయించారు. దీంతో విపరీతంగా దుమ్ము దూళి వాహనాలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు లేచి మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఇకనైనా అధికారులు కళ్లు తెరిచి రోడ్డు వేయాలని కోరుతున్నారు.