Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
దోమల ద్వారా వచ్చే వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉంటు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి సురేష్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జ్వరం సోకిన ప్రతి వ్యక్తిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తగు చికిత్స నిమిత్తం ఆశాలు పంపాలని అన్నారు. వారంలో రెండు రోజులు డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. అలాగే ప్రతి ఆశ తన పరిధిలో ఉన్న అర్హులైన వారందరినీ గుర్తించి 100% కోవిడ్ టీకాలు పూర్తయ్యేలాగా చూడాలన్నారు. ఈనెల 12వ తేదీ నుండి డిసెంబర్ నెల చివరి వరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహించబడుతుంది అని, అవసరం ఉన్న వారు మీసేవ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకొని వారికి కేటాయించబడిన తేదీ ప్రకారం ఖమ్మం వెళ్లాలని వైద్యాధికారి డాక్టర్ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రామారావు శాంత కుమారి ఆశాలు పాల్గొన్నారు.