Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల పరిధిలోని రామన్న పాలెం గ్రామంలో 70 క్వింటాళ్ల రేషన్ బియ్యం నాలుగు టాటా ఏసీ వాహనాల్లో తరలిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు డీఎస్ఒ రాజేందర్ తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జయంతి గ్రామానికి తరలిస్తుండగా రామన్నపాలెంలో పట్టుకున్నారు. వీరిలో ఒకరు పరారీలో ఉండగా జయంతి గ్రామానికి చెందిన గుండెబోయిన గోపి, కొండూరు గోపి, కల్లూరు గ్రామానికి చెందిన భూక్య బద్రిలను అదుపులో తీసుకొని వాహనాలను ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
నిందితులపై 6ఏ కేసు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిస్టిక్ డిటి రామచంద్ర రావు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఏమధుసూదన్ రావు, ఖమ్మం రూరల్ డిటి రవి తదితరులు పాల్గొన్నారు.