Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
మండల పరిధిలోని పాకలగూడెం, రామానగరం, రామానగరం గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న క్రమంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎంపీపీ హైమావతి శంకర్రావు మాట్లాడుతూ మండలంలో మరో 5వేల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తే పరిపూర్ణ వాక్సినేషన్ మండలంగా సత్తుపల్లిని ప్రకటించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ చొరవ తీసుకొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుభాషిణి, ఎంపీవో కష్ణ, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మందపాటి వాసురెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు తుంబూరు కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, ఎంఈవో రాములు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.