Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము నందు శ్రీ ప్లవ నామ సంవత్సర శ్రీదేవి శరన్నవరాత్రోత్సవ బ్రహ్మౌత్సవాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి జగన్మోహనరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల కృష్ణ మోహన్ శర్మ తెలిపారు. బుధవారం ఆలయమునందు జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తారీకు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి గురువారం నుండి 15వ తారీకు ఆశ్వీయుజ శుద్ధ దశమి శుక్రవారం వరకు బ్రహ్మౌత్సవాలు నిర్వహించబడుతాయని తెలిపారు. ఏడో తారీఖు కలిశ స్థాపనతో బ్రహ్మౌత్సవాలు లు ప్రారంభం కాగా అదే రోజు అమ్మవారు చందన అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. 8న బాల త్రిపుర సుందరి అలంకరణ, 9న గాయత్రి దేవి అలంకారం, 10న లలితా పరమేశ్వరి అలంకారం, 11న అన్నపూర్ణాదేవి అలంకారం, 12న సరస్వతి దేవి అలంకారం, సామూహిక అక్షరాభ్యాసం, చండీ హౌమం ప్రారంభం, 13న దుర్గాష్టమి శ్రీ కనక దుర్గ దేవి అలంకరణ, కనకదుర్గ పూజలు, 14న మహిషాసుర మర్దిని అలంకారం, మహర్నవమి, 15 విజయదశమి రాజరాజేశ్వరి దేవి అలంకారం, విజయదశమి, శమీపూజ నిర్వహించబడుతుందని తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ బి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, వంశీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.40.70 లక్షల
జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కు బడుల హుండీలను మంగళవారం విప్పి లెక్కించగా శ్రీవారి ఆదాయం 40 లక్షల 70 వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపా యలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధి కారి జగన్మోహన్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్టుగా తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖమ్మం వారి పర్యవేక్షణలో పరిశీలకురాలు ఆర్ సమత సమక్షంలో హుండీలను లెక్కించినట్లుగా తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల కృష్ణమోహన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, సూపర్డెంట్ బి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, ఆలయ సిబ్బంది, అర్చక బందం, మధిర సత్యసాయి సేవా సమితి, భక్తులు, తదితరులు హుండీ కార్యక్రమంలో పాల్గొన్నారు.