Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
స్థానిక టిటిడిసి నందు ఖమ్మం కార్పొరేషన్ కార్మికులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం కార్పొరేషన్ కార్మికులను, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, జెసిపి డ్రైవర్లు, జవాన్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు ఆత్మీయ సన్మానం మేయర్ హౌదాలో చేస్తున్నందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా అవార్డులతోపాటు 1000 రూపాయలు క్యాష్ అవార్డు ను అందజేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు అన్ని విభాగాలలోని ఎంప్లాయిస్కి గుర్తింపు, అవార్డులను అందజేస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, సహాయక కమిషనర్ మల్లీశ్వరి, సీనియర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఆత్మ కమిటీ సభ్యులు బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.