Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలు ఇచ్చేవరకు భవిష్యత్ పోరాటాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాపితంగా జరిగిన సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పోడు రైతులతో పాటు ఇతర ప్రజలు ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలియచేసాయని రోడ్ల దిగ్బంధనం కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య విప్లవ జేజేలు తెలియచేశారు.బుధవారం స్థానిక మంచికంటి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా వేంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వానికి సడక్ బంద్‌తో వణుకు పుట్టిందని, అందుకనే పోడు భూములకు పట్టాలు ఇస్తానని ప్రకటించారని తెలిపారు. అడవులను కాపాడి సరక్షించేది ఆదివాసులు అని వారిని భూమి నుండి వెళ్ళ గొట్టే చర్యలను తిప్పి కొడతామని ఆయన హెచ్చరించారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చేవరకు భవిష్యత్ పోరాటాలు నిర్వహిస్తామని భవిష్యత్ పోరాటాలలో సడక్ బంద్ స్ఫూర్తితో పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కార్యదర్శవర్గ సభ్యులు గుగులోత్ ధర్మ, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత ధర్మ ఎం.రేణుక, లిక్కి బాలరాజు, దొడ్డ రవి, చిరంజీవి నాయుడు, వీర్ల రమేష్, భూక్యా రమేష్, వెంకటేశ్వర్లు, చరణ్, సత్యనారాయణ, వాని, సత్య, తిరుపతిరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.