Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
యన్.సీ.యల్.పీ బాలవెలుగు వలస గొత్తికోయ పాఠశాలలో శాస్త్ర బద్ధంగా, అత్యంత వైభవంగా బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. మండలంలోని ధర్మన్న నగర్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, బాలవెలుగు పాఠశాలలో బుధవారం బతుకమ్మ పండుగ సందర్భంగా గొత్తికోయ విద్యార్ధులు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. విద్యార్ధులు పసుపుతో గౌరమ్మను తయారుచేసి బతుకమ్మలను పేర్చీ ఆట పాటలతో పాఠశాలలో శాస్త్ర బద్ధంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనగ రామచందర్ రావు కొబ్బరి కాయ కొట్టి బతుకమ్మ ఆటను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో కొలువుతీరిన బతుకమ్మలను ఆటపాటల అనంతరం గ్రామ వీధుల్లో విద్యార్ధులే స్వయంగా నెత్తికెత్తుకొని ఊరేగింపు గా పిల్లవాగు చెరువులో నిమజ్జనం చేయడంతో బతుకమ్మ సంబురాలు ముగిసాయి. అత్యంత ఉత్సాహంగా విద్యార్ధులు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనగ రామచందర్ రావు మాట్లాడుతూ నాగరికత తెలియని, మన తెలుగు వారి ముఖ్యంగా మన తెలంగాణా పండుగలు జరుపుకోవడం అనాగరికులుగా ధర్మాన్ నగర్ విద్యార్ధులకు, గ్రామ ప్రజలకు తెలవదని, నెమ్మదిగా గ్రామ ప్రజలకు,విద్యార్ధులకు బతుకమ్మ పండుగను వీరితో నిర్వహించడం ఆనందంగా వుందన్నారు. ఇలాంటి సాంస్కృతి సాంప్రదాయాలను గొత్తకోయ విద్యార్థులకు నేర్పడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్ సలోమణి, పాల్గొన్నారు.