Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండలంలో జానికిపురం సమీపంలో గల సత్తెమ్మ గుడి దగ్గర ట్రాక్టర్ ఆటోని ఢకొీట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల కథనం ప్రకారం యర్రగుంట వైపు నుండి అధిక లోడ్ సుమారు 17 టన్నుల బరువుతో జామాయిల్ కర్ర లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ రాజపురం గ్రామానికి చెందిన ఆటో అబ్బుగూడెం నుండి కూలీలను జానికిపురం తీసుకు పోతుండగా మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో స్వగ్రామం సమీపంలోని సతెమ్మ గుడి దగ్గర మృత్యువు రూపంలో ట్రాక్టర్ వచ్చి ఆటోని ఢకొీట్టింది. ఆటో పాల్టీ కొట్టి జానికిపురం గ్రామానికి చెందిన పాతురి మారేశ్వరావు(27)అనే యువకుడుకి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ హాస్పటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తికి తలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలియజేశారు. ఇది అంత ఇలా ఉండగా ప్రమాద సంఘటన చూసిన పలువురు ఓవర్ లోడ్ కి సింగిల్ రోడ్ మీద పదుల కిలోమీటర్ల సంబంధిత అధికారులు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ హాస్పటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.