Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె నోటీసును ఈఓ కు అందజేత
నవ తెలంగాణ-భద్రాచలం
ఈనెల 8న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె జరుగుతుందని పంచాయతీ కార్మికులందరం సమ్మెలో పాల్గొంటామని పంచాయితీ ఈఓకి సమ్మె నోటీస్ ను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మ చారి, జిల్లా కమిటీ సభ్యులు యం.బీ. నర్సారెడ్డిలు మాట్లాడుతూ మల్టిపర్పస్ విధానం రధ్దు చేయాలని పేర్కొన్నారు. కనీస వేతనం రూ. 19000 ఇవ్వాలని, అందరిని పర్మినెంట్ చేయాలని, ఫీయఫ్, ఈ.యస్.ఐ. చేయాలని అన్నారు. అనంతరం సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి, జిల్లా కవ్నిటి సభ్యులు యం.బీ.నర్సా రెడ్డి, నాయకులు బండారు శరత్ బాబు, నాగరాజు, పి. సంతోష్, జి.పి.యూనియన్ నాయకులు కాపుల రవి, జక్కుల కృష్ణార్జున్ రావు, బండారు రామకృష్ణ ,విజయ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : అక్టోబర్ 8న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల బందును విజయవంతం చేయాలని సిఐటియు భద్రాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్షులు శ్రీరామ్ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పినపాక మండలం ఈ.బయ్యారం క్రోస్ రోడ్ లో ఆయన మాట్లాడారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు. సమ్మె సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిటీపీఎస్, సిఐటియు ఉపాధ్యక్షులు వై రవి, నాయకులు పాల్గొన్నారు
జూలూరుపాడు : ఈనెల అక్టోబర్ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త షెడ్యుల్ పరిశ్రమ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మండలంలో షెడ్యూల్ పరిశ్రమలైన రైస్ మిల్లులు, బ్రిక్స్ ఇండిస్టీయాల్ గుమస్తాలు కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశాలలో సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడారు. అనంతరం యాజమాన్యాలకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బానోత్ ధర్మ, సీఐటియు నాయకులు రామోహన్రావు, సంఘాల నాయకులు జె.నరేష్, ఎం రమేశ్, ఎల్.సేవ పాల్గొన్నారు.