Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు కారేపల్లికి చెందిన యువకుడు గడ్డం దిలీఫ్‌కుమార్ ఎంపికైనాడు. ఈనెల 2,3 తేదిల్లో డిల్లీలో జాతీయ స్ధాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కబడ్డీ అండర్-19 తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గడ్డం దిలీఫ్ కుమార్ అత్యంత ప్రతిభ కనపర్చి జాతీయ స్ధాయిలో తెలంగాణ జట్టును రన్నర్‌గా నిలపటంతో పాటు జాతీయ జట్టుకు ఎంపికైనాడు. తెలంగాణ రాష్ట్రం నుండి ముగ్గురు ఎంపిక కాగా వారిలో కారేపల్లి యువకుడు దిలీఫ్‌కుమార్ ఒకడు. నవంబర్‌లో నేపాల్‌లో జరిగి అంతర్జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. జాతీయ స్ధాయి పోటీలు ఎంపిక కావటం ఇది రెండోవసారి. 2019లో కూడా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనాడు. కబడ్డీలో ప్రతిభ చూపిన దిలీఫ్కుమార్ను వైరా ఎమ్మెల్యో ఫోన్లో అభినందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన గడ్డం దిలీఫ్‌కుమార్ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. తల్లిదండ్రులు గడ్డం కోటేశ్వరరావు-లక్ష్మి దంపతులు కారేపల్లిలో ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తూ కుమారుడిని ఉన్నత స్ధాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. పేద కుటుంబం కావటంతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటానికి దిలీఫ్ కుమార్ ఇబ్బందులు పడుతున్నాడు. డిల్లీ జరిగిన పోటీలకు దాతల సహకారంతో డిల్లీ వెళ్ళి క్రీడా పోటీల్లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే ఉన్న దిలీఫ్‌కు ఇబ్బందిగా మారింది. దాతలు సహకరిస్తే తప్ప అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన లేని పరిస్ధితి ఉంది. ఎవరైన దాతలు సహకరిస్తే తన ప్రతిభను చాటే అవకాశం ఉంటుందని, దాతలు సహాయం అందించాలని దిలీఫ్ కుమార్ వేడుకున్నాడు.