Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ముదిగొండ
తెలంగాణ కల్లుగీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభ మల్లారపు యాదాద్రి అధ్యక్షతన ముదిగొండలో బుధవారం జరిగింది. ఈ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదకరమైన కల్లుగీత వృత్తిని చేస్తూ గీత కార్మికులు అనాదిగా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ సమస్యలతో సత మతమవుతూ కుటుంబాలను పోషించుకుం టూన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వృత్తిని కాపాడుకుంటున్న కల్లుగీత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం దారుణం అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలపై చేసిన అనేక పోరాటాల ఫలితంగా ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని, 560 జిఓ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఏ సొసైటీలో కూడా ఆ జీవో అమలుకు నోచుకోలేదన్నారు. కల్లుగీత కార్మికులందరికీ ప్రభుత్వమే బీమా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, జిల్లా గౌరవ అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కల్లుగీత కార్మికులు ఎక్స్ గ్రేషియా వెంటనే ఇవ్వాలని, లాక్డౌన్ సందర్భంగా ప్రమాదం జరిగిన వారి దరఖాస్తులు స్వీకరించి ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, అర్హులైన వారందరికీ సభ్యత్వం ఇవ్వాలని ప్రమాదంలో గాయపడిన వారికి ఐదు లక్షలు చనిపోయిన వారికి పది లక్షలు మెడికల్ బోర్డు అంశాలు లేకుండా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 31 వ తారీకు ఖమ్మంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గాలి అంజయ్య, నాయకులు మొక్క నాగేశ్వరరావు, మరికంటి సైదులు తదితరులు పాల్గొన్నారు.