Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృథాగా పోతున్న నీళ్లు..పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కొణిజర్ల
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో అతిముఖ్యమైనది మిషన్ భగీరథ.. ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కొన్ని కోట్లరూపాయల నిధులతో గ్రామానికి ఒక ట్యాంక్ చొప్పున సుమారు ఎనిమిది నుంచి పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ట్యాంకులు నిర్మించేందుకు మండలంలో నూతనంగా 39 ట్యాంకులు నిర్మించారు. ఈ ట్యాంకులు నిర్మాణాలు చేసే సమయంలో సంబంధిత అధికారులు పర్యవేక్షణలో జరగాల్సి ఉండంగా అటువైపు కన్నెత్తి చూడలేదనే ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ ట్యాంక్‌ల పనులు చేయడంతో ట్యాంకులు లీకవుతున్నాయని, నీళ్ళు వృథాగా పోతున్నాయని విమర్శలు వచ్చిపడుతున్నాయి. పదికాలాల పాటు ఉండాల్సిన ట్యాంక్‌లు నాసిరకం ఇసుక సిమెంట్‌తో కట్టడం వల్ల ట్యాంక్‌లు శిథిలావస్థకు చేరే పరిస్థితి నెలకొంది. జంపాలనగర్ గ్రామంలో గత పదిహేను రోజులుగా ట్యాంక్ ద్వారా నీరు వృథాగా పోతున్నా అధికారులకు సూచించినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలి : ఎంపీటీసీ తేజావత్ కుమారి తాగేనీళ్లు వృథాగా పోతున్నా అధికారులు నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్లు వృథాగా పోకుండా చూడాలన్నారు.