Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే తొలి రోజు ఎంగిలి బతుకమ్మ ఆట పాటలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణం మండలంలోని వివిధ కూడళ్ళలో పంచాయతీలు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఆడే ప్రాంతాలలో శోభాయమానంగా తీర్చిదిద్దారు. బతుకమ్మ ఆట పాటలను హనుమంతుల పాడులో ఎంపీపీ చీమల నాగరత్నమ్మ ప్రారంభించారు. మహిళలు,పిల్లలు ముస్తాబై బతుకమ్మలు ఎత్తుకొని వచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఉత్సాహంగా పాటలు పాడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాడు వెంకటేశ్వరావు మాట్లాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కతికి చిహ్నం అన్నారు.
గుండాల : మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ మండలంలోని అన్ని గ్రామాలలో ఎంగిలి పూల బతుకమ్మతో బుధవారం ప్రారంభమైంది. మండల కేంద్రంలోని జీసీసీ సెంటర్లో గల నూతన బతుకమ్మ ఘాటును గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, ఎంపీఓ హజరత్ అలీ కొబ్బరికాయలు కొట్టి ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇల్లందుల అప్పారావు,గడ్డం లాలయ్య, సారయ్య, బుజ్జిబాబు, బొబ్బిలి సమ్మయ్య, రాము, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఎత్తుకున్న జెడ్పీ చైర్మెన్
టేకులపల్లి : మండలంలోని 36 గ్రామ పంచాయతీలతో పాటు మండల కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలతో బతుకమ్మ పండుగ ఘనంగా ప్రారంభమైంది. బుధవారం మండలం టేకులపల్లి లో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మహిళలతో పాటు బతుకమ్మ ఆడే బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. టేకులపల్లి మండలం, గోలియాతండ గ్రామపంచాయతీ పరిధిలోగల ,శ్రీ జానకి కోదండ రామాలయం ఆవరణ బతుకమ్మ ఘాట్ దగ్గర కని, విని, ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా రాధ, సర్పంచులు బోడా నిరోషా మంగీలాల్ నాయక్, బోడా సరిత శ్రీనివాస్, కోరం ఉమా సురేందర్, ఉప-సర్పంచ్ సురేష్, ఎంపీటీసీ అప్పారావు, మాజీ సర్పంచ్ ఇస్లావత్ పార్వతి-రెడ్యానాయక్, స్థానిక నాయకులు, మహిళలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
మణుగూరు: మణుగూరు సబ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకవైపు కరోనా , మరోవైపు విషజ్వరాలు పీడీస్తున్న బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కులాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాలలో నియమ నిష్టలతో పూలను సేకరించి బతుకమ్మలు పేర్చారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను మేళాతలాలతో చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతానికి బతుకమ్మలు తీసుకెళ్లి లయబద్దంగా చప్పట్లు కొడుతూ ,ఊయల పాటలు పాడారు. ప్రధానంగా సాంబాయిగూడెం, పగిడేరు, మణుగూరు, శివలింగాపురం, సుందరయ్యనగర్, సింగరేణి కార్మిక వాడల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
సంస్కృతి సాంప్రదాయాలు మేలు కలయిక బతుకమ్మ
దుమ్ముగూడెం : పెత్రమాస సందర్బంగా తెలంగాణ ఆడపడుచులు ప్రతి సంవత్సరం నిర్వహించుకునే సంస్కృతి సాంప్రదాయాల మేలు కలయిక బతుకమ్మ పండుగ సంబురాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలు మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో ప్రారంభం అయి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. మండలంలోని కె.లకీëపురం, పర్ణశాల, చిన్నబండిరేవు, లకీëనగరం, రేగుబల్లి, తూరుబాక తదితర గ్రామాల్లో మొదటి రోజు ఎంగిలి పువ్యు బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభం అయ్యాయనే చెప్పవచ్చు.
బతుకమ్మ ఘాట్ పనులు పరిశీలించిన ఎండీవో
అశ్వారావుపేట : బతుకమ్మ పండుగ సంబురాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బతుకమ్మల ఆటపాటలను పురస్కరించుకుని బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు తగిన ఏర్పాట్లును పూర్తి చేశారు. పట్టణంలోని కోనేరు చెరువులో నిమజ్జనం చేసేందుకు మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏర్పాట్లును సర్పంచ్ అట్టం రమ్యతో కలసి ఎంపిడిఒ విద్యాధరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బతుకమ్మలను కోనేరులో నిమజ్జనం చేసేందుకు కావలసిన ఏర్పాట్లును నిత్యం పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి సూచించారు.
రాత్రి పూట నిమజ్జనాలు చేసే అవకాశం ఉండటంతో తగిన విద్యుత్ సౌకర్యంను కల్పించాలన్నారు. అంతే కాకుండా నిమజ్జన సమయంలో పర్యవేక్షణలో భాగంగా పంచాయతీ సిబ్బంది ఘాట్ వద్ద ఉంచాలన్నారు. బతుకమ్మ ఘాట్ పనులను పరిశీలించిన వారిలో ఇ.ఒ గజవెల్లి హరికృష్ణ, సిబ్బంది కామేష్ తదితరులు ఉన్నారు.