Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 1న దీపావళీ బోనస్
- ఈ నెల 8న పండుగ అడ్వాన్స్ చెల్లింపు
- ఒక్కో కార్మికునికి రూ.1లక్షా 15 వేల చెల్లింపులు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ సాధించిన వార్షిక లాభాల వాటాలోంచి కార్మికుల వాటాను వారికి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులకు ఈనెల 11న సింగరేణి లాభాల బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. 8వ దసరా పండుగ సందర్భంగా కార్మికులకు ఆడ్వాన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. కాగా, నవంబర్‌లో రానున్న దీపావళి పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. సంస్థ సాధించిన లాభాల బోనస్ రూ. 79.07 కోట్లు కార్మికులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంది. దీపావళి బోనస్ రూ.300 కోట్లు చెల్లిస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మెన్ ఎండి. ఎన్.శ్రీధర్ కార్మికులకు బుధవారం తీపికబురు ప్రకటించారు. పండుగల సందర్భంగా ముందస్తుగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11వ తేదీన చెల్లిస్తున్నట్లు తెలిపారు. దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ బోనస్) ను నవంబర్ 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. ఈ బోనస్ చెల్లింపు కోసం సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని, ఈ బోనస్ కింద ప్రతీ కార్మికుడు రూ.72,500 లు అందుకోనున్నాడని తెలిపారు. రెండు బోనస్‌ల చెల్లింపుకు సింగరేణి రూ.379.07 కోట్లను వెచ్చిస్తుందన్నారు. కాగా పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలను ప్రకటించిందని, ఈ సొమ్మును ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని ఎండి తెలిపారు. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి కార్మికులు సగటున సుమారు రూ.1 లక్షా 15 వేల వరకూ రానున్నట్లు తెలిపారు. ఈ ఆర్ధిక మొత్తాన్ని దుబారా చేయకుండా ముఖ్యమైన వాటికి వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని చైర్మెన్ కోరారు.