Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రిలో ప్రారంభమైన శరన్ననవరాత్రి,
- శ్రీరామాయణ పారాయణ మహౌత్సవాలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వేం చేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు ఆలయంలో శ్రీ దేవి శరన్న నవరాత్రి మహౌత్సవాలు బుధవారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు. ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత లక్ష్మితాయారు అమ్మవారి మూలవరులకు పంచామృతాలతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారం ధరింపజేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ఈ సమయంలో సామూహిక కుంకుమార్చన, బాలకాండ పారాయణం నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో దేవస్థానం ఏఈవో వి.శ్రావణ్ కుమార్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడినేటి సీతారామాను జాచార్యులు, అమరవాది విజయరాఘమన్ తదితర వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
భక్తిప్రపత్తులతో ప్రారంభమైన రామాయణ పారాయణం
భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూటమి మండపంలో బుధవారం నుంచి శ్రీరామాయణ పారాయణ మహౌత్సవాలు భక్తిప్రతులతో ప్రారంభమయ్యాయి. ముందుగా పారాయణం చేసే పండితులు చిత్రకూట మంటపానికి చేరుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పారాయణం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేద పండితులు, పండితులు తరలిరావచ్చారు. ఈ సమయంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారామ చంద్రస్వాముల ను చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి రామాయణ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా సప్తాహ హవనం ఆలయ అర్చకులు నిర్వహించారు. అదేవిధంగా చిత్రకూట మండపంలో ప్రతి రోజు సాయంత్రం రామాయణ ప్రవచనాలను వేద పండితులు చేయనున్నారు.
నేడు సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారు:
రామాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారు నేడు (గురువారం) సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అఖిల జగన్నాత్మరం, అస్మన్మాతరం అంటూ ప్రార్ధిస్తారు.