Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
బతుకమ్మ పండుగ సందర్భంగా 30 డివిజన్లో ఐద్వా, డివైఎఫ్ఐ, టియుడిఎఫ్, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బతుకమ్మలు పేర్చిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఐద్వా త్రీ టౌన్ కార్యదర్శి పత్తిపాక నాగ సులోచన, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు షేక్ ఇమామ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా సుందరయ్య నగర్ ప్రాంతంలో మహిళలు అత్యధికంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుతున్నారన్నారు. అలాగే మహిళా సంఘం సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. కార్యక్రమంలో టియుడిఎఫ్ జిల్లా కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, డివైఎఫ్ఐ నాయకులు ఎర్ర నగేష్, రంగు హనుమంత చారి, సారంగి పాపారావు, బెజవాడ చంద్రశేఖర్, రంగు పుష్పావతి, షేక్ కుల సనా బేగం, రంగు భవాని, మూడు వేల పద్మ, ఊడుగుల మాధవి, వుడు గల శ్రీను, వనమాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.