Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
బడుగు జన బాందవుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తితో అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. గురువారం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నెస్పీ క్యాంప్‌లోని సంఘం జిల్లా కార్యాలయంలో శంకరన్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మనోహర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల ఐఏఎస్ అధికారి'గా, మహౌన్నత మానవతావాదిగా చరిత్రలో నిలచిన శంకరన్ జీవితం నేటి తరం అధికారులకు, సామాజిక, ఆర్ధిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నవారందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సంక్షేమానికే పూర్తికాలం అంకితమైన ఆయన 2010 అక్టోబర్ 7న హైదరాబాద్‌లో మరణించారన్నారు. నిరుపేదల సేవే సిసలైన ప్రజాపాలన అని నిరూపించి కోట్లాది మంది దళిత, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన అసలు సిసలైన ప్రజాసేవకుడు ఐఏఎస్ శంకరన్ అని వారు కొనియాడారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కుక్కల సైదులు, బొట్ల సాగర్, నందిగామ కృష్ణ, గోపే వినరు, రెడపంగి ప్రకాష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీర్, పొన్నం రమణ, జాలా శ్రీనివాస్, భారతమ్మ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.