Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సానుభూతి పరులు మువ్వ రంగయ్య బుధవారం రాత్రి హైదరాబాదులో ఆకస్మికంగా మరణించారు. స్వగ్రామమైన కొత్త లంక పల్లి గ్రామంలో ఆయన పార్ధివ దేహానికి గ్రామస్తులు, ప్రముఖులు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యావేత్త సాహితీవేత్త మువ్వా శ్రీనివాసరావు, క్రాంతి తండ్రిగారైన మువ్వ రంగయ్యకు అంతిమ వీడ్కోలు నిర్వహించారు. రంగయ్య పార్ధివదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, మాదినేని రమేష్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజరు బాబు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్ట దయానంద్, విజయకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు, ఎంపిపి లక్కినేని అలేఖ్య వినీల్, సిపిఎం మండల కార్యదర్శి చలమల విఠల్ రావు సందర్శించి నివాళులర్పించి మువ్వా శ్రీనివాసరావు కుటుంబానికి సానుభూతి తెలిపారు.
పలువురు విద్యావేత్తల నివాళి
మువ్వా రంగయ్య మృతికి పాఠశాల యాజమానుల సంఘం జిల్లా అధ్యక్షులు రాంచందర్‌రావు, కార్యదర్శి ఇస్మాయల్, రాష్ట్ర ప్రతినిధి రామారావు, శేషుకుమార్, శేషగిరి, నవీన్‌రావు, రాఘవరావు, శ్రీధర్, వీరారెడ్డి, శశిధర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాయల సతీష్, రంజీత్, రవి, కోటేశ్వరరావు, లక్ష్మణ్, ఉభయ జిల్లాల పాఠశాల ప్రతినిధులు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.