Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విలేకర్ల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-ఇల్లందు
నిరుద్యోగులు, పేదలకుసహాయపడటానికే హరిప్రియ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.నాగేశ్వరరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, శీలం రమేష్, కంభంపాటి రేణుక, ఫౌండేషన్ కమిటీ సభ్యులు శ్రీకాంత్, జె కే శ్రీను, పి.వి.రావు, హరికృష్ణ, ఈసం నర్సింహారావు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆర్ఆర్ కాలనీలో స్థలం కబ్జా చేసి ఫౌండేషన్ కార్యాలయం కడుతున్నట్టు కొందరు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అవగాహన లేక దుష్ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. 36 మంది కమిటీ సభ్యులతో ఫౌండేషన్ ఏర్పడినట్లు తెలిపారు. ఎవరి పేరున సొంత పట్టాకాదని అన్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు శిక్షణలు ఇప్పించడం, పేదలకు సహాయం అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ ఏర్పడినట్లు పేర్కొన్నారు.