Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో విడుదల చేసిన జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కరోనా వల్ల మరణించిన, గని ప్రమాదాల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి నెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యల పరిష్కారానికై సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సీఐటీయూ ఈ నెల 8వ తేదీన తలపెట్టిన ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని కొత్తగూడెం కార్పొరేట్లో గురువారం నాడు విస్తృత ప్రచారం నిర్వహించారు. వివిధ డిపార్ట్మెంట్లో వద్ద జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రగాని కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులను మోసం చేస్తున్నాయని, తీవ్రమైన వివక్షత చూపిస్తున్నారని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం చంద్రశేఖర్, సూరం ఐలయ్య, పరశురాం, సందీప్, శ్రీను, అప్జల్, జీవన్, రాజకుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యుల్ పరిశ్రమల్లో కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి : ఎంవి.అప్పారావు
సీఐటీయూ అధ్వర్యంలో 8న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతుందనీ, షెడ్యూల్ పరిశ్రమలలో పని చేస్తున్న అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో తప్పకుండా పాల్గొని సమ్మేను జయప్రదం చేయాలని సీఐటీయూ ప్రతినిదులు విస్కృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎంవి.అప్పారావు మాట్లాడారు. ఈ కా ర్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు భూక్యా రమేష్, డి.వీరన్న, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.