Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ముసలయ్య
అ పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ
నవతెలంగాణ-పాల్వంచ
విద్యార్ధులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరాలని రజక వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి ముసలయ్య అన్నారు. గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నపేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు సాయం చేశారు. పట్టణం బోల్లరుగూడెం 11వ వార్డులో అత్యంత నిరుపేదల అయినా సుమారు 12 కుటుంబాల విద్యార్థులకు సుమారు రూ.4వేల విలువ చేసే నోట్ పుస్తకాలను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ముసలయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి అధికారులు కావాలన్నారు. తద్వారా పేద ప్రజలకు న్యాయం చేయాలని వారి ఈ సందర్భంగా కోరారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, పాల్వంచ పట్టణ మండల కన్వీనర్ గూడెపూరి రాజు మాట్లాడుతూ ముసలయ్య సేవలు అభినందనీయమని వారు ఎంచుకున్న లక్ష్యం మంచి విద్య అని ఆ లక్ష్యం దిశగా విద్యార్థినీ విద్యార్థులను పయనించాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు.