Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ధృవీకరణ పత్రాలు జారీలో పెండింగ్లో ఉంటే సంబంధిత తహసీల్దారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ అనుదీప్ తహసీల్దారులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి తహసిల్దారులు, నాయబ్ తహసిల్దారులతో గత సమావేశంలోని అంశాలు, భారీ వర్షాలు, వరదల వల్ల మరణించిన వ్యక్తులు, పశువులకు, ఇండ్లు కూలిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు, ధరణి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు మండలాల్లో ఐదు, మున్సిపాల్టీలలో నాలుగు ప్రాంతాల్లో భూములు గుర్తింపు, ప్రభుత్వ భూములు ల్యాండ్ మార్క్, ఆక్రమణలు, అక్రమ ఇసుక, మట్టి రవాణా, మన ఇసుకవాహనం, కోర్టు కేసులు, మీ-సేవా కేంద్రాలు నిర్వహణ, రేషన్ దుకాణాలు, మిల్లులు, పెట్రోల్ బంకుల తనిఖీ, మీ సేవా కేంద్రాల నుండి సర్టిఫికేట్లు జారీ, ఆహార భద్రత కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, రెండు పడక గదుల ఇండ్లు, జిఓనెం.76 ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, అటవీ, రెవిన్యూ భూములు రీ కన్సలేషన్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ధరణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని తహసిల్దార్లను ఆదేశించారు. ఐరిష్, ఓటిపి రాని వ్యక్తులు రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కళ్యాణలక్ష్మి పథకంలో ఆర్థిక సాయం కోసం వచ్చిన 684 దరఖాస్తులను విచారణ నిర్వహించి అర్హుల జాబితాను శాసనసభ్యుల నుండి అనుమతి తీసుకోవాలని, వారం రోజుల్లో పరిష్కరించాలని చెప్పారు.
పెండింగ్లో ఉన్న 61 షాదిముబారక్ దరఖాస్తులను వారంలో అర్హుల జాబితాను సిద్ధం చేసి శాసనసభ్యుల అనుమతి కొరకు అందచేయాలని చెప్పారు. కళ్యాణలక్ష్మి చెక్కులు 145 బ్యాంకుల్లో చెల్లింపు చేయాల్సి ఉందని, ఎల్డీయంతో చర్చించి తక్షణం నిధులు చెల్లింపు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఏఓ గన్యాకు సూచించారు. ధృవీకరణ పత్రాలు నిర్దేశిత సమయంలోగా జారీ చేయాలని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై కార్యాచరణ నివేదికలు అందచేయలని లబ్దిదారులు ఎంపిక ప్రక్రియ జాప్యం కాకుండా చూడాలని చెప్పారు. ఇంటిస్థలాల క్రమబద్దీకరణ ఇల్లందులో 90, కొత్తగూడెంలో విచారణ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. డోర్ లాక్ ఉన్న, డాక్యుమెంట్లు ఇవ్వని వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని, అందుబాటులో లేకపోతే రిజిష్టర్ పోస్టుతో పాటు, వాల్సాప్లో పోస్ట్ చేయడంతో పాటు ఇంటికి నోటీసు అంటించి ఫోటో తీసి బద్రపరచాలని, ఈ మొత్తం ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం కాకుండా చేసేందుకు ఇద్దరు నాయబ్ తహసిల్దార్లను రిజిష్ట్రార్ కార్యాలయంలో విధులు కేటాయించాలని ఆర్డీఓకు సూచించారు. ఈ వీడియో కాన్షరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, పిఆర్ ఈఈ సుధాకర్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ రాములు, కలెక్టరేట్ ఏఓ గన్యా, అన్ని మండలాల తహసిల్దారులు, నాయబ్ తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.