Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో గత మే నెలలో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో 188 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన టీఎన్టీయూసీ యూనియన్ను తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు ఆహ్వా నించి అభినందించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘ ఎన్నికల్లో వివరాలను అడిగి తెలుసుకుని టీఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పోటు రంగారావు, ఐటీసీ టీఎన్టీయూసీ యూనియన్ అధ్యక్షులు కనక మేడల హరి ప్రసాద్, చైర్మన్ గల్లా నాగ భూషయ్య, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం అందించాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భం గా పోటు రంగారావు మాట్లాడుతూ పాలనలో చంద్రబాబు విజనరీ ఆదర్శనీయమని, తాను కూడా దానిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లానని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకె.బోస్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వి.రత్నాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఐటీసీ టీఎన్టీ యూసీ కార్యవర్గం, టీడీపీ మండల నాయకులు జగదీశ్వ రరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.