Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) కార్యకర్తల పోరాట
పటిమ ఆదర్శ నీయం
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని
అ గాయపడిన పార్టీ కార్యకర్తలను
పరామర్శించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మన్యానికి ఉద్యమాలు నిర్బంధాలు కొత్తవి కావని, ఈతరం సీపీఐ(ఎం) కార్యకర్తలు కూడా వాటిని కొనసాగిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఈ నెల 5వ తారీకున పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో వీరోచిత పోరాట ప్రతిమను చూపిన ప్రతి పార్టీ కార్యకర్తకు పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ అభినందనలని ఆయన తెలిపారు. భద్రాచలంలో గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కమిటీ సభ్యురాలు బెల్లంకొండ కుసుమలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, మచ్చా వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్యలు పరామర్శించి, అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ భద్రాచలం డివిజన్‌కు మొదటి నుండి పోరాటాల చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఆనాటి నాయకత్వం నుండి, నేటి నాయకత్వం వరకు అనేక రకాల పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. పోలవరం వ్యతిరేక పోరాటంలో లాఠీ దెబ్బలు తూటాలకు జైళ్లకు భయపడక భద్రాచలం డివిజన్ కామ్రేడ్స్ చూపించిన తెగువ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. తర్వాత కాలంలో కూడా భద్రాచలం డివిజన్‌ను ముక్కలు కాకుండా చూసేందుకు అమరజీవి సున్నం రాజయ్య తన ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమాలు నిర్వ హించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకట రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు పి.సంతోష్ కుమార్, యన్. నాగరాజు, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు.