Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాలేజీ ఫీజుకు రూ.20 వేలు అందజేత
నవతెలంగాణ-భద్రాచలం/దుమ్ముగూడెం
భద్రాచలం డివిజన్ పరిధిలోని దుమ్ముగూడెం మండలం మారుమూల ఏజెన్సీ గ్రామమైన లింగాపురంనకు చెందిన కాకా జోగారావు అనే యువకుడి చదువుకి ఆర్థిక సాయాన్ని ఎస్పీ సునీల్ దత్ అందజేశారు. ఆల్ ఇండియా లెవెల్లో 9వ ర్యాంక్, తెలంగాణ రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించి భారతదేశంలోనే ఏకైక నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో సీటు సంపాదించిన కాకా జోగారావు కాలేజీలో చేరడానికి ఫీజు కట్టలేక ఆర్థిక సమస్యలతో ఎస్పీ ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయం సందర్శన సందర్భంగా అక్కడే ఉన్న ఎస్పీని కలిసిన జోగారావుకు తక్షణమే రూ.20 వేలు కాలేజీ ఫీజు కట్టుకోవడానికి అందజేసారు. అంతే కాకుండా ఒక్కొక్క ఏడాదికి రూ.లక్ష ఖర్చు అవుతుందని తెలియజేసిన జోగారావు చదువు పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులను అందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మొదట భద్రాచలం ఏఎస్పీ వినీత్ కలిసిన యువకుడి ప్రతిభ గురించి ఎస్పీకి తెలియజేయడంతో స్పందించిన ఎస్పీ వెంటనే యువకుడి చదువుకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్రీడల్లోనూ, పర్వతారోహణలో అత్యంత ప్రతిభ కలిగిన జోగారావును అభినందిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో పథకాలను సాధించి భారతదేశానికి, మన రాష్ట్రానికి తన పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జి.వినీత్ పాటు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.