Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, జిల్లా అధ్యక్షుడు ఎంవి.అప్పారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
జీతాలు, ఉద్యోగ భద్రతపై చిత్త శుద్ధి లేని రాష్ట్ర ప్రభుత్వం అని సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు, జిల్లా అధ్యక్షుడు ఎంవి.అప్పారావు అన్నారు. చాలి చాలని జీతాలు, శ్రమటోడ్చి వ్యవస్థను నడుపుతున్న అసంఘటిత కార్మికులు హక్కుల సాధన కోసం షెడ్యుల్ పరిశ్రమల్లో కార్మికుల రాష్ట్ర వ్యాప్త చేపట్టిన సమ్మెలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సమ్మె విజయవంతంఅయిందని తెలిపారు. శుక్రవారం పోస్ట్ ఆఫీస్ నుండి బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందీ. ప్రదర్శన పోస్టాఫీస్, బస్టాండ్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యలయం వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ నాయకులు డి.వీరన్న అధ్యక్షత సభ జరిగింది. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా అధ్యక్షుడు ఎంవి.అప్పారావు మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యరగాని కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా నేతలు భూక్యా రమేష్, డి వీరన్న, మేకల రాయమల్లు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.