Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సారపాక, గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరి సుపరిచితుడైన భట్టు భీముడు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న భట్టా మల్లయ్య సేవా ట్రస్ట్ బృందం వెంటనే స్పందించి రూ.10 వేలు ఆర్ధిక సహాయాన్ని శుక్రవారం వారి కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ గ్రామానికి చెందిన తలారి ప్రభాకర్, సరిత దంపతులకు చెందిన మూడు సంవత్సరాల చిన్నారి గుండెకు రంధ్రం పడి అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న భట్టా మల్లయ్య చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ సభ్యులు భట్టా విజరు గాంధీ వెంటనే స్పందించి వారి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.3 వేలు వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అన్ని విధాలుగా అండగా ఉంటానని చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమాల్లో స్థానికులు బిజ్జం వెంకటేశ్వరరెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.