Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గ్రామ పంచాయతీ కార్మికులకు పీఆర్సీ కమీషన్ సిఫారసు చేసిన కనీస వేతన చట్టం రూ.19 వేల చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీం వర్కర్ల రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు మండల పరిషత్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి, ఎంపీఓ ముత్యారావుకు అందజేశారు. ఈ సందర్బంగా వారు కార్మికుల డిమాండ్లను ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులు, ఎస్ఎల్ఎస్ పవర్ ప్రాజెక్టు కార్మికులు, పెట్రోల్ బంకు కార్మికులు పాల్గొన్న సమ్మెను ఉద్దేశించి పద్మ మాట్లాడారు. కార్మికులు చాలీ చాలనీ వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసి కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు రూ.19 వేల అందజేయడంతో పాటు పిఎఫ్, ఇఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. సమ్మెలో మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, కార్మికులు కన్నయ్య, ప్రకాష్, వెంకటేష్, ప్రసాద్, భవాని, రేవతి, సునీత, నర్సింహారావు, వెంకటేష్ పాల్గొన్నారు.
టేకులపల్లి : షెడ్యూల్ పరిశ్రమలలో కాంట్రాక్ట్ కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ నెంబర్ 22ను అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం 26 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, భూ నిర్వాసితుల సొసైటీ అధ్యక్షులు నరసింహారావు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రాజెక్ట్ కార్యదర్శి రమేష్, అధ్యక్షులు చిట్టిబాబు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : షెడ్యూల్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలేటి కిరణ్ కుమార్, వెంకటమ్మ, తాళ్లూరి కృష్ణ, కిరణ్ కుమార్, మహమూద్, రాజేష్, శ్రీనివాస్‌లు నాయకత్వం వహించారు షెడ్యూలు కార్మికులు పాల్గొన్నారు.
ములకలపల్లి : కనీస వేతనం చట్టం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్మికులు, సిబ్బంది వన సేవకులు అబ్బులు, పెంటమ్మ, ఇందిరా పెట్రోల్ బంక్ సిబ్బంది రాజి శ్రీను, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ : కనీస వేతనాలు జీవోను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ అన్నారు. శుక్రవారం మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు కాంతయ్య, వెంకటేశ్వర్లు, బాలు, శివ, సత్యం, సీతారాములు, రాధ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : జీపీ కార్మికుల వేతనాలను పెంపుదల చేయకుండా సీఎం కేసీఆర్ మాటలు గారిడీ చేస్తున్నారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ అన్నారు. స్థానిక పూర్వ మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఆ సంఘం మండల నాయకుడు మూల అప్పన్న అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సమ్మెకు మద్దతుగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య హాజరై మాట్లాడారు. అనంతరం ప్రదర్శన నిర్వహించి, తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తాహశీల్దార్ చల్లా ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మండల నాయకులు కామేశ్వరరావు, రాజపుత్ర రంజిత్ సింగ్(నందు), నగేష్, రత్నం, మురళీ, నాగేంద్ర, దుర్గమ్మ, జ్వోతి తదితరులు పాల్గొన్నారు.
పినపాక : సీఐటీయూ పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడారు.
అశ్వాపురం : మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. 24 గ్రామపంచాయతీలోని కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెను ఉద్దేచించి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు బీరం శ్రీనివాస రావు మాట్లాడారు. ఈ సమ్మెకు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కృష్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రంలో రైతు సంఘం మండల కార్యదర్శి సాంబశివరావు, సీఐటీయూ నాయకులు దండి రాములు, గ్రామ పంచాయతీ మండల అధ్యక్షులు రామచంద్రయ్య, శివకృష్ణ, వెంకన్న, రాంబాబు, రమేష్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.