Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
శుక్రవారం జరిగిన దూదేకుల ముస్లిం మైనార్టీ సమావేశంలో ఖమ్మం నగరానికి చెందిన షేక్ లాల్ జాన్ పాషాకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. అనంతరం లాల్ జాన్ పాషాకు నియామక పత్రాన్ని ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు, కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా , రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ యండి రహీం పాషా , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యండి ముస్తాఫా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కలాం , రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అన్వర్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి సొంధుమియా , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, షేక్ జానీ బేగం పాల్గొన్నారు.