Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
చదువు మానవ హక్కుని, రాబోయే తరంలో విద్యార్థిని విద్యార్థులందరూ ఐఏఎస్‌లు కావాలని, సమాజ పుర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ సవాంగ్ ఆకాంక్షించారు.మండల పరిధిలో బాణాపురం గ్రామంలో ఆవుల అమ్మిరెడ్డి మెరిట్ స్కాలర్షిప్ పేరుతో బాణ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (గండ్లూరి కిషన్ రావు కళావేదిక) యందు శుక్రవారం ఫౌండేషన్ చైర్మన్, విశ్రాంతి ఐఆర్ఎస్ అధికారి ఆవుల భాస్కర్‌రెడ్డి తన సొంత ఖర్చులతో ఉచితంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ప్రతిభ సాధించిన 26 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 10 వేలరూపాయల చొప్పున రెండు లక్షల 60 వేల రూపాయలతో పాటు మెమొంటో, మెరిట్, సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం న్యూలక్ష్మీపురం గ్రామపంచాయతీలో నర్సరీ కోసం ఏర్పాటు చేసిన స్థలమును ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో డి శ్రీనివాసరావు, ఎంపిఓ పి సూర్యనారాయణ, డిప్యూటీ తాసిల్దార్ టీ కరుణాకర్ రెడ్డి,ఈజీఎస్ఏ ఏపీఓ పి అజరు కుమార్, ఐకెపి ఏపిఎం గంగుల చిన్న వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఐ విజయరాజు, ఈసీ కిరణ్ కుమార్, ఆవుల అమ్మిరెడ్డి మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోఆర్డినేటర్, ఆవుల భరత్‌రెడ్డి, ఫౌండేషన్ అధ్యక్షులు వట్టికూటి వెంకటేశ్వర్లు, గ్రామసర్పంచ్ ఆవుల రమలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పచ్చా సీతారామయ్య, ఆవుల వరదారెడ్డి, జైపాల్‌రెడ్డి చైతన్యరెడ్డి, పి.రాంబాబు, పాలవాయి, పాండురంగారావు, పొట్ల బాబురావు పాల్గొన్నారు.