Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-దుమ్ముగూడెం
మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు మేలు కలయికగా ఆడపడుచులు నిర్వహించుకుంటున్న బతుకమ్మ వేడుకలలో బాగంగా మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు సంబురంగా నిర్వహించుకున్నారు. ఒక విదంగా చెప్పాలంటే బతుకమ్మ ఆట పాటలు, సంబురాలతో పల్లెలు పులకరించి పోతున్నాయనే చెప్పవచ్చు.
పినపాక : మండలంలోని తోగ్గూడేం పంచాయతీలో గల ఆదివాసీ గ్రామం టేకులగూడెంలో బాల వెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ప్రోత్సహించి, ఆదివాసీ గూడెం ఆడబిడ్డల అందరిచేత బతుకమ్మను ఆడించారు. ఈ కార్యక్రమంలో టేకులగూడెం గ్రామానికి చెందిన మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.