Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు
నవతెలంగాణ-కరకగూడెం
పలు సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ నిరాహారదీక్ష చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపీడబ్ల్యూ విధానం రద్దు చెయ్యాలని, కారోబార్, బిల్ కలెక్టర్ల ప్రత్యేక హౌదా కల్పించాలని, జీతభత్యాలు సిఫారసు ప్రకారం కనీసం నెలకు రూ.19000 ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే దశల వారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.