Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజల ప్రాణాలు కబళించినా కరోనా,
డెంగ్యూ విషజ్వరాలు
అ కానరాని బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ-మణుగూరు
సంవత్సర కాలంలో మొదటగా జరుపుకునే పండుగ దసరా. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసినా ప్రజల మొఖాల్లో పండుగ వెలుగులు కనిపించడం లేదు. కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ డెంగ్యూ, విషజ్వరాలు అధిక సంఖ్యలో ప్రజల ప్రాణాలను కబళించింది. ప్రాణాలు కోల్పోయినా కుటుంబాలు కరోనా, డెంగ్యూ విషజ్వరాల భారిన పడి రూ.లక్షల్లో ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కించుకున్న, ఆర్దికంగా చితికిపోయినా కుటుంబాలు పండుగలు, వేడుకలు దూరంగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి సోకిన కరోనా ఛాయలు వలన తీవ్ర ఆర్ధిక నష్టానికి గురి అయ్యారు. ఒకవేళ పండుగ చేసుకుందాం అన్నా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ ధరలు రూ.950 నుండి 1000 దాటేందుకు వడివడిగా ముందుకు సాగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 200 శాతం అధికంగా రేట్లు పెరిగాయి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ రంగానికి తెగనమ్ముతున్నాయి. దీని కారణంగా కాంట్రాక్టు కార్మికుల సంఖ్య అధికంగా పెరిగి కార్మిక చట్టాలకు అనుగుణంగా జీతాలు చెల్లించలేకపోవడం వలన కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోజు వారి కూలీల పరిస్థితి చెప్పనవసరం లేదు.
రోజు వారి కూలికి వెళ్లినా రోజు గడవడం లేదు
కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ భార్య
రోజు వారి కూలికి వెళ్లినా రోజు గడవడం లేదని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ కరోనాతో మరణించిన బొల్లెం శ్రీకాంత్ భార్య తెలిపారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామన్నారు. అత్తవారివైపు, అమ్మవారి వైపు రోజు వారి కూలీ కుటుంబ సభ్యులే అని, ఎవరూ ఆర్ధికంగా అండగా లేకపోవడంతో రోజువారి కూలీకి వెళ్లినా సరే పిల్లలకు సరైనటువంటి ఆహారం అందించలేకపోతున్నాని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దసరా పండుగ కూడా తమ పిల్లలకు బట్టలు సరైన ఆహారం అందించలేకపోతున్నందుకు బాధగా ఉందని, తన భర్త బతికి ఉంటే సంతోషంగా ఉండేవారమని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.