Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అంగన్వాడీ టీచర్ల శిక్షణా శిబిరంలో సీడీపీఓ
నవ్యశ్రీ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పోషకాహార లోపాన్ని, రక్త హీనతను తగ్గించేందుకు 0 నుండి 6 సంవత్సరాల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిరుదాన్యాల వంటకాలు అందజేయనున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి నవ్యశ్రీ అన్నారు. శుక్రవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిదిలోని పర్ణశాల, ఆర్లగూడెం, నర్సాపురం సెక్టారు పరిదిలో గల పెద్దనల్లబల్లి, గంగోలు, నర్సాపురం రైతు వేదిక భవనంలో పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పోషక విలువలు, చిరుదాన్యాల వంటకాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్లు ధనలకీë, సావిత్రి, కవిత, మణి, పోషన్ అభియాన్ సిబ్బంది కల్పన, ఆర్పిలు సుహాసిని, రాణిలతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.