Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని టీర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో తెల్లం వెంకట్రావు ఆదేశానుసారం నియోజకవర్గ కార్యవర్గం తొలి సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు కె.జె.ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ఆవశ్యకత, చేయవలసిన పనుల, ప్రజలతో సంబందాలు, పార్టీతో సంబంధాలు ఎలా ఉండాలో వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐదు మండలంలోని అధ్యక్షులు అరికెల్ల తిరుపతి రావు, సోయం రాజారావు, గంప రాంబాబు, రామకృష్ణారెడ్డి, మీడియా సలహాదారు కె.ప్రబోధ్ కుమార్, ఐదు మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.