Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
కార్పెంటర్ వర్కర్స్‌కి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యుడు, కార్పెంటర్ సంఘం సీనియర్ నాయకులు ఎస్కె కమీళి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం కార్పెంటర్ సంఘం మండల కమిటీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు ముప్పిడి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. కార్పెంటర్ సంఘం మండల కమిటీ నూతన అధ్యక్షుడిగా తూముల శ్రీనివాసాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మేకల ప్రసాదు, కార్యదర్శిగా ఎస్కే సాలెహ, కోశాధికారిగా ముప్పిడి సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ముప్పిడి సుబ్బారావు, అమిరుద్దీన్, శ్రీరాములు, శ్రీకాంత్ మండలంలోని కార్పెంటర్లు వర్కర్స్ పాల్గొన్నారు.