Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కృషి
అ మండల స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా తన్నీరు
నవతెలంగాణ-భద్రాచలం
పోరాటమే ఊపిరిగా, అనేక ఉపాధ్యాయ సమస్యల పరిస్కారం కోసం కృషి చేసిన భద్రాచలం నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు తన్నీరు శ్రీనివాసరావుకు పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సముచిత స్థానం కల్పించింది. తన్నీరు సేవలను గుర్తించిన రాష్ట్ర కమిటీ ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఆదివారం నిజామాబాదులో జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో తన్నీరు ప్రమాణస్వీకారం చేసి పదవి భాద్యతలు చేపట్టారు. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయుడు తన్నీరు. ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్య వచ్చినా, తాను ముందుండి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆకుంటిత దీక్షతో కృషి చేస్తూ, భద్రాద్రి ఏజెన్సీలో ఎందరో ఉపాధ్యాయుల ఆరాధ్య నాయకునిగా నిలిచారు. భద్రాచల మండల కార్యదర్శిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులుగా మూడు పర్యాయలు పనిచేసిన తన్నీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నెల రోజులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముంపు మండలాలలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ను తెలంగాణకు రప్పించడానికి అవిరాళ కృషి చేశారు. ఈ సమస్య కోసం పీఆర్టీయూ బృందంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర హౌమ్ మినిస్టర్ రాజనాథ్ సింగ్, ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీని కలిసి ముంపు మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యను పార్లమెంట్లో చర్చించేలా చేసి ఎట్టకేలకు ముంపు మండలాల ఉద్యోగ ఉపాధ్యాయులను తెలంగాణాకు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించి సంచలనం సృష్టించి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఈ సమస్యపై రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి తన వాణి సభలో వినిపించారు. ఈ సందర్భంగా తన్నీరు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు డి.వెంకరేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి.రవి, రాష్ట్ర నాయకులు ధనుకొండ శ్రీనివాసరావు, కే.వి.రమణతో పాటు జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ నుండి పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా భాద్యతలు చేపట్టిన తన్నీరుకు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.