Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అధ్యక్ష, కార్యదర్శులుగా
సీతారాములు, గౌస్ నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్మించిన ఎన్నికల జరిగాయి. అశ్వాపురం, జగ్గారం నుండి మిట్టగూడెం, కళ్యాణపురం, మణుగూరు మండలాల 14 గ్రామ పంచాయతీలు, మున్సిపాలీటీలలో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 1,822 సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. సీఐ భాను ప్రకాష్, ఎస్సై నరేష్, అశ్వాపురం ఎస్హెచ్ఓ సట్ల రాజు, సిబ్బంది ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహి ంచారు. ఎన్నికల్లో సీతారాములు ప్యానెల్ తనుగుల శ్రీను (గురుస్వామి), ప్రసాద్, మొత్తం మూడు ప్యానెల్స్ పోటీ దారులుగా ఉన్నారు. భారీ ఎత్తున ప్యానెల్స్ అభ్యర్దులు తమ స్వంత ఖర్చు తో కార్మికుల సంఘ సభ్యత్వాన్ని నమోదు చేయించి ఓట్లుగా మలు చుకున్నారు. గతంలో 700 లోపు ఉన్న సభ్యులు ఒక్కసాగరిగా 1,822కు చేరడం ఆశ్చర్యా నికి గురి చేసింది. ఒక్కోక్క కార్మికుడి దగ్గర నుండి రూ.300 సభ్యత్వంకు వసూలు చేసినట్లు సమాచా రం. అభ్యర్దులు కూడా భారీ సంఖ్యలో ప్రచా రం ని ర్వహ ంచి మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు కార్మి కులు తెలిపారు. ఎవరు గెలిచినా కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని అభ్యర్దులు తెలిపారు.
అధ్యక్ష, కార్యదర్శిగా సీతారాములు, గౌస్
భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా సీతారాములు ప్యానెల్ ఎన్నికయ్యారు. సీీతారాములు సమీప అభ్యర్ది తనుగుల శ్రీను (గురు స్వామి)పై 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీతా రాములు భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షునిగా వరుసగా నాలుగు సార్లు గెలవడం రికార్డుగా నిలి చింది. ప్రత్యర్ధి అభ్యర్తి బండారి మాధవ్‌పై గౌస్ ప్రధా న కార్యదర్శిగా 211 ఓట్లతో ఆధిక్యం సాధించి గెలు పొందారు. దీనిపై పలువురు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.