Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తూట్లు పొడిసి, కార్మిక సంక్షేమాన్ని నీరుగారుస్తున్నాయని తెలంగాణ బిల్డింగ్, అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాచారి, జిల్లా సహాయ కార్యదర్శి గురవయ్య అన్నారు. నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమ చట్టానికి సవరణలు చేయాటాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సంక్షేమ బోర్డును, రక్షించుకోవటం కోసం జరుగుతున్న పోరాటలను విజయవంతం చేయాలన్నారు. 1996 కేంద్రచట్టానికి, వలస కార్మికుల చట్టానికి చేసిన సవరణలు విరమించు కోవాలని డిమాండ్ చేశారు. కార్మికహక్కులు కాల రాయటంలో పాలక ప్రభుత్వాలు పోటి పడుతున్నాయని అన్నారు. కార్మికుల సొమ్మును రాష్ట్రప్రభుత్వం కాజేసే చర్యలను ప్రతిఘటిస్తామని అన్నారు. పోరాడి సాధించబడిన సంక్షేమ బోర్డును రక్షించుకోవటానికి పోరాటమే మార్గమని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రభుత్వం అక్రమంగా వాడుకున్న రూ.1004 కోట్లలను ప్రభుత్వం తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన హైద్రాబాద్ కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా జయప్రదంగా జరిగిందని ఆ సందర్భంగా ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36వేలక్లైమ్స్ పెండింగ్లో వున్నాయని, వాటి పరిష్కారానికి వెంటనే నిధులు విడుదల చేయాలని అన్నారు. అన్ని మండల, పట్టణ కేంద్రాలలో నిర్మాణ రంగం కార్మికులకు అడ్డా స్ధలం కేటాయించాలని కోరారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్ధుచేయాలని డిమాండ్ చేశారు. వెల్పేర్ బోర్డులో జమ అయిన నిధులను కార్మికుల సంక్షేమం కేసం ఖర్చు చేయాలని అన్నారు. సీఐటీయూ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్క ర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు యం.బీ.నర్సారెడ్డి, పట్టణ నా యకులు నాగరాజు, వెంకటరెడ్డి, పెంటర్ యూని యన్ నాయకులు జాకీ, అప్పారి రాము, నాగరాజు, వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.