Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
చిన్న వయసులోనే కన్న తండ్రి ఋణం తీర్చుకుంది ధరావత్ శ్రీనిత్య జూలూరుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ధరావత్ శ్రీనివాస్ అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మంచితనానికి మారుపేరు శ్రీనివాస్. ప్రభుత్య ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి, యువకులకు సైతం ఆదర్శంగా నిలిచాడు. శ్రీనివాస్‌కు ఒక్కతే కూతురు శ్రీనిత్య. కొడుకు లేకపోవడంతో కొడుకు స్థానంలో శ్రీనిత్య తలగొరివి పెట్టడంతో అక్కడున్న స్థానికులు సైతం కంఠతడి పెట్టారు. శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలుసుకున్న, మండల ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ మిత్రులు, పలువురు సంతాపం వ్యక్తం చేసారు.