Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మిడియం బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ వాటిని కార్పొరేట్ శక్తులకు అమ్మె కుట్ర చేస్తున్నారని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిడియం బాబురావు డిమాండ్ చేశారు. ఆదివారం లకీëనగరం పట్టణ 10వ శాఖా సమావేశంలో ఎండి హహమ్మద్ బేగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైల్వే, ఎల్ఐసీ, అనేక బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తుల్లో పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేసి రైతులు పండించిన పంటలకు గిటుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, .జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు, సర్పంచ్ సరియం రాజమ్మ, సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, గుడ్ల రామ్మోహన్ రెడ్డి, సాయి, మద్ది రామిరెడ్డి, గుడ్ల తాతారావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.