Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పంచాయతీ సిబ్బంది దీక్షను ప్రారంభించిన
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని మాధారం పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకునేంతవరకూ ఆందోళన ఆగదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు అన్నారు. ఆదివారం పంచాయతీ కార్యదర్శి ఆగడాలకు వ్యతిరేకంగా పంచాయతీ సిబ్బంది చేపట్టిన దీక్షను ఆయన పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తీసుకువచ్చి పంచాయతీ సిబ్బంది, ఇతర సిబ్బందిని మరింత పనివత్తిడికి గురిచేస్తుందన్నారు. చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని, కరోనా సమయంలో వీరు ఫ్రంట్ చైనావారియర్స్ ముందుండి కరోనా వచ్చిన వ్యక్తులను దహన సంస్కారాలు చేసే విషయమై ముందుండి నడిచారన్నారు. పంచాయతీ కార్యదర్శి సిబ్బంది వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని, ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) మద్దతు పంచాయతీ సిబ్బందికి అన్నివేళలా ఉంటుందన్నారు. కార్మికులకు ఈఎస్ఎస్ఐ, ఉద్యోగభద్రత కల్పించాలని, ట్రాక్టర్ నడిపేవారికి సర్పంచ్ లైసెన్స్ ఇప్పించాలని, వనసేవకులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి నిధుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం దిశగా కార్మికులు బక్యతతో పోరాటానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ శ్రీను, చిక్కుల శ్రీను, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.