Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
క్రీడలు వల్ల మనిషికి మానసిక ఉల్లాసం కలుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న దేవ సహాయం (బాబు) మెమోరియల్ ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ఫైనల్స్ జరిగాయి. ఇందులో హౌరాహౌరిగా సాగిన ఫైనల్ పోరులో ఇన్విటేషన్ టోర్నమెంట్ జట్లు దేవసహాయం జట్టు రన్నర్‌గా ఫైనల్ విజేతలుగా నిలిచారు. మంచి పోటి ఇచ్చిన గోల్కోండ ఓల్డ్ బార్సు ఫుట్‌బాల్ క్లబ్ జట్టు విన్నర్స్‌గా నిలిచాయి. గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. క్రీడలు మానిసిక ఉల్లాసాన్ని, స్నేహభావాన్ని పెంపోందిస్తాయని తెలిపారు. నేటి యువత చెడు దారిలో వెళ్లకుండా వారికి ఉన్న సమయాన్ని క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడల్లో రానిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ బహుమతి ప్రధాన కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్లు కె.బసవయ్య, అందెల ఆనందరావు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, సిఐలు సతీష్ (హైదరాబాద్), ఎండి. హనన్ (వరంగల్), టోర్నమెంట్ ఆర్గనైజర్ కర్ణ కుమార్, నరేందర్, నిరంజన్, ప్రేమ్ కుమార్, పాస్నైట్, వాసిరెడ్డి నరేష్ కుమార్, సుల్తాన్, అల్లి శంకర్, క్రీడాకారులు, దేవ సహాయం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.