Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రారంభానికి సిద్ధంగా సోనూసూద్ విగ్రహం
నవతెలంగాణ- బోనకల్
సినిమాలలో తనదైన శైలిలో విలన్‌గా రాణిస్తూ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అందరి హృదయాలలో హీరోగా నిలిచిపోయాడు. తన అభిమాన హీరోకి ఏకంగా తన సొంత ఖర్చులతో సోనీ సూద్ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అతనే బోనకల్లు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు. కరోనా ఉగ్రరూపం దాల్చిన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్ హీరోగా నిలిచారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటుకు పూనుకున్నాడు. అది కూడా సొంత ఖర్చుతోనే ఏర్పాటుకు నడుంబిగించాడు. తమ ఎస్సీ కాలనీలో సోనూ సూద్ విగ్రహం కోసం గత కొన్ని రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈనెల 12 తేదీలోపు సోనూసూద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గుర్రం వెంకటేశ్వర్లు తెలిపారు. వెంకటేశ్వర్లు సొంత ఖర్చుతో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయమని డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ గ్రామ సర్పంచ్ దారెల్లి నరసమ్మ ఉప సర్పంచ్ తాత లక్ష్మీనారాయణ ఎంపీటీసీ గుడిపుడి అప్పారావు మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, గ్రామ ప్రజలు అభినందించారు.